టేస్టీ టేస్టీ వాంగీ బాత్
వాంగీ బాత్ (Vangi Bath) ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. వంకాయ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. భేషుగ్గా ఉంటుంది ఈ రెసిపీ. ఎప్పుడు వంకాయతో కర్రీస్ మాత్రమే కాకుండ ఇలా రైస్ తో కూడా ట్ర్య్ చేయండి. సింపుల్ గా అయిపోతోంది. టైం కూడా ఎక్కువగా పట్టదు. ఎపుడైనా టైం తక్కువగా ఉంది అన్నపుడు ఒక సారి ఇది చేసి చూడండి, అంతే ఇక నోటి నుండి మాట రాదు. అంతేనా ఇంకా లేదా అని అంటారు. అంత బాగుంటుంది. ఈ రెసిపీ కర్ణాటక లో చాలా ఫేమస్ . ఆంధ్రా, తెలంగాణ లో కూడా తరచుగా చేసుకుంటూ ఉంటారు. పిల్లలకి లంచ్ బాక్స్ లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. కర్రీస్ అంతగా ఇష్టపడని పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇలాంటి డీఫ్రెంట్ రైస్ ఐటమ్స్ చేసి ఇవ్వండి లంచ్ కి , మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు. లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది. పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడానికి పెద్ద హైరానా పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. అన్నం ముందే వండేసి పెట్టుకుంటే 15 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఎలాగూ అందరి ఇళ్లలో వంకాయలు ఉంటూనే ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం రుచులకు మరియు కురాగాయలకు రారాజు అయిన వంకాయతో సింపుల్ వాంగీ బాత్ తయారీ విధానం ని చూసేద్దామ! క్యాలోరీస్ 337 క్యాలో...