టేస్టీ టేస్టీ వాంగీ బాత్
వాంగీ బాత్ (Vangi Bath)
ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. వంకాయ నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. భేషుగ్గా ఉంటుంది ఈ రెసిపీ. ఎప్పుడు వంకాయతో కర్రీస్ మాత్రమే కాకుండ ఇలా రైస్ తో కూడా ట్ర్య్ చేయండి. సింపుల్ గా అయిపోతోంది. టైం కూడా ఎక్కువగా పట్టదు. ఎపుడైనా టైం తక్కువగా ఉంది అన్నపుడు ఒక సారి ఇది చేసి చూడండి, అంతే ఇక నోటి నుండి మాట రాదు. అంతేనా ఇంకా లేదా అని అంటారు. అంత బాగుంటుంది. ఈ రెసిపీ కర్ణాటక లో చాలా ఫేమస్ . ఆంధ్రా, తెలంగాణ లో కూడా తరచుగా చేసుకుంటూ ఉంటారు.
పిల్లలకి లంచ్ బాక్స్ లో ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. కర్రీస్ అంతగా ఇష్టపడని పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇలాంటి డీఫ్రెంట్ రైస్ ఐటమ్స్ చేసి ఇవ్వండి లంచ్ కి , మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు. లంచ్ బాక్స్ ఖాళీగా వస్తుంది. పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయడానికి పెద్ద హైరానా పడిపోవాల్సిన అవసరం కూడా లేదు. అన్నం ముందే వండేసి పెట్టుకుంటే 15 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఎలాగూ అందరి ఇళ్లలో వంకాయలు ఉంటూనే ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం రుచులకు మరియు కురాగాయలకు రారాజు అయిన వంకాయతో సింపుల్ వాంగీ బాత్ తయారీ విధానం ని చూసేద్దామ!
క్యాలోరీస్
337 క్యాలోరీస్
ప్రొటీన్ -5.1g ౹ కార్బోహైడ్రేట్లు - 49.5 g
ఫైబర్ - 5.2 g ౹ ఫ్యాట్ - 13.2 g
విటమిన్ A - 186.7 mcg ౹ విటమిన్ C - 8.4mg
ఫోలిక్ యాసిడ్ - 19mcg ౹ కాల్షియమ్ - 50.1 mg
పొటాషియం - 103.8 mg ౹ ఐరన్ - 1.1 mg
వాంగీ బాత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:-
- బియ్యం - ఒకటిన్నర కప్పు
- వంకాయలు - 4 నుండి 5 - కడిగి ముక్కలుగా కోసుకుని పెట్టుకోవాలి
- శనగపప్పు - 2 టేబుల్ స్పూన్లు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 2 లేదా మీ రుచికి సరిపడ
- ఉల్లిపాయ - 1 తరిగి పెట్టుకున్నవి
- కారం - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 4 రెబ్బలు
- పసుపు - పావు టీ స్పూన్
- చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడినంత
- పచ్చి బఠాణీలు - అర కప్పు
- పల్లీలు - అర కప్పు
- వాంగీ బాత్ మసాల పొడి - 3 టేబుల్ స్పూన్లు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర - గార్నిష్ కోసం
- ఇంగువ - చిటికెడు
వాంగీ బాత్ మసాల తయారు చేయడానికి కావలసిన పదార్థాలు :-
- లవంగాలు - 3
- యాలకులు - 3
- షాజీర - అర టీస్పూన్
- మెంతులు - అర టీస్పూన్
- జాజికాయ పొడి - అర టీస్పూన్
- ఎండుమిర్చి - 4
- దాల్చినచెక్క - 1 inch
- ధనియాలు - 2 టీస్పూన్లు
- శనగపప్పు - 2 టీస్పూన్లు
- మినప్పప్పు - 2 టీస్పూన్లు
- నువ్వులు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- కోబ్బరి ముక్కలు - పిడికెడు
తయారీ విధానం:-
- ముందుగా బియ్యాన్ని బాగా కడిగి వండుకుని చల్లార్చుకోవాలి.
- అన్నం ని మెత్తగా వండుకోకూడదు. కలిపేటపుడు ముద్దలుగా ఉండలు కడుతుంది కాబట్టి పలుకులుగా వండుకోవాలి.
- ఇపుడు వాంగీ బాత్ మసాల తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలను అన్నిటినీ ఒక్కొక్కటిగా సన్నని మంట మీద వేయించుకుని చల్లారిన తరువాత పౌడర్ చేసి పెట్టుకోవాలి.
- ఇపుడు ఒక కడాయి లో తగినంత నూనె వేసుకుని కాగిన తరువాత జీలకర్ర, శనగపప్పు,కరివేపాకు వేసి వేయించి ఇపుడు పల్లీలు,పచ్చిమిర్చి వేసి 50% వేయించుకుని ఉల్లిపాయ తరుగు , ఉప్పు, పసుపు వేసి కలిపి దోరగా వేయించుకోవాలి.
- 50% ఎందుకు అన్నాను అంటే ఉల్లిపాయలు వేసిన తరువాత కూడా అవి వేగే లోపల పల్లీలు మాడిపోతాయు కాబట్టి చూసుకుంటూ మాడిపోకండ అన్నిటినీ దోరగా వేయించుకోవాలి.
- ఇపుడు పచ్చి బఠాణీలు వేసి కలిపి 3 నిమిషాలు సిమ్ లో పెట్టుకోవాలి.
- తరువాత వంకాయ ముక్కలను వేసి కలిపి మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి.
- తరువాత కారం, వాంగీ బాత్ మసాల పొడి, చింతపండు గుజ్జు, తగినంత ఉప్పు వేసి కలిపి 10 నిమిషాలు సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి.
- అప్పుడప్పుడు మూత తీసి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి.
- తరువాత స్టవ్ ఆఫ్ చేసి అన్నం, నెయ్యి వేసి కలిపి కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ వాంగీ బాత్ రెడీ.
- వాంగీ బాత్ కి కాంబినేషన్ కోసం రైతా అని చెప్పుకోవచ్చు లేదా ఏదయినా పులుసు కానీ కుర్మా కానీ ఏదయినా బాగుంటుంది
- వట్టిది తిన్నా కూడా భలేగా ఉంటుంది
- తప్పకుండా ప్రయత్నించండి. అందరికి షేర్ చేయండి
ఇందులో పచ్చి బఠాణీలు మాత్రమే కాకుండ బీన్స్ కూడా వాడుకోవచ్చు. వాంగీ బాత్ పౌడర్ కూడా ఇపుడు మార్కెట్ లో అందుబాటులో ఉంది. కానీ ఏదయినా మన ఇంట్లో తయారు చేసినట్లు ఉండదు కదా. వాంగీ బాత్ లో చిటికెడు బెల్లం పొడి కానీ చిటికెడు పంచదార కానీ యాడ్ చేస్తే రుచి అమోఘం. కర్ణాటక వాళ్ళు ఖచ్చితంగా బెల్లం ని కానీ పంచదార ని కాని యాడ్ చేస్తారు.
హెల్త్ బెనిఫిట్స్:-
- వంకాయ లో వుండే ప్రోటీన్స్ బ్రెయిన్ ఫంక్షన్స్ ని మెమోరీ ని ఇంప్రూవ్ చేయడంలో సహాయ పడుతుంది
- బ్లడ్ ప్రెషర్ ని మరియు స్ట్రెస్ ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది
- ఎవరైతే పొగ త్రాగడం మనేయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళకి తొందరగా మనేయ్యడానికి సహాయ పడుతుంది.
Comments
Post a Comment