లస్సీ ( Lassi )

లస్సీ ఒక టేస్-టీ కూల్ డ్రింక్ . ఇది మన ఇండియా లో వేసవి కాలములో అందుబాటులో వుంటుంది.మండే సూర్యుడి వేడి నుండి ఉపశమనం లభించడానికి చాలా బాగా ఉపయోగ పడుతుంది.ఈ రోజుల లో మనకు చాలా కూల్ డ్రింక్స్ అందుబాటులో వున్నా యి. కానీ మనకు ఆరోగ్యం ఇచ్చే వాటి కే ప్రాధాన్యము ఇవ్వడం చాలా ముఖ్యం.అందులో ఒకటి ఈ లస్సీ అని మనం చెప్పవచ్చు.

ప్రిపేర్ చేయడానికి తీసుకునే టైమ్
   ఇది మనకు తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. పది నిమిషాల్లో ఇది తయారు చేసుకోవచ్చు.

పాపులర్ అయిన ప్లేసెస్
ఆల్ ఓవర్ ఇండియా లో దీని గురించి తెలియని వారు ఎవరు వుండరు అండి.అందరికి దీని గురించి తెలిసి ఉంటుంది. వేరే దేశాలలో కూడా ఉంటుంది. కాకపోతే తయారీ విధానం కానీ ఇందుకోసం వాడే పదార్థాలు వేరే ఉండొచ్చు. ముఖ్యంగా మన ఆంధ్రా-తెలంగాణా-కర్ణాటక లలో చాలా ఫేమస్ అండి ఈ లస్సీ.పంజాబ్ లో కూడా చాలా ఫేమస్ అండి

ఆల్టర్నేటివ్ నేమ్స్
తాక్, చాస్

అకేషన్
రెగులర్
ఈ లస్సీ ని డైలీ తీసుకోవచ్చు. లేదా వీక్లీ 2 టైమ్స్ తీసుకోవచ్చు. మధ్యాహ్న భోజనం చేసేటపుడు కానీ భోజనం అయ్యాక కానీ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎపుడు తాగాలి
ముఖ్యంగా సమ్మర్ లో డైలీ 2 టైమ్స్ దీనిని తీసుకున్న తప్పులేదండి. కానీ చలికాలంలో మాత్రం వీక్లీ 2 టైమ్స్ తీసుకోవాలి అది కూడా మధ్యాహ్నం మాత్రమే తీసుకోవాలండి. లేదంటే జలుబు చేస్తుంది.

రెసిపీ లైఫ్
తయారు చేసిన తరువాత 2 నుండి 3 గంటల సమయం వరకు బయట ఉంటుంది అండి. ఫ్రిడ్జ్ లో పెడితే ఒక రోజు కూడా ఉంటుంది.సమ్మర్ లో ఎక్కువసేపు బయట ఉంచకూడదు అండి తొందరగా ఎండ వేడి నుండి పాడయ్యే అవకాశం ఉంటుంది.

ఏ ఏజ్ వాళ్ళు తాగొచ్చు
1 సంవత్సరం నుండి అన్ని ఏజెస్ వాళ్ళు తాగొచ్చు. పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం మధ్యాహ్నం మాత్రమే ప్రిఫర్ చేయాలండి. ఎందుకంటే కొంతమంది కి జలుబు చేసే అవకాశం ఉంటుంది.

కాలోరీస్
1 గ్లాస్ స్వీట్ లస్సీ లో 286 కాలోరీస్ ఉంటాయి.
కొలెస్ట్రాల్ -24mg, కార్బోహైడ్రేట్లు-34.8g,ప్రోటీన్-6.5g,ఫ్యాట్-9.8g,కాల్షియమ్-52%,ఫాస్పరస్-32%

బెనిఫిట్స్ ఆఫ్ లస్సీ

1.వ్యాధి నిరోధక శక్తి ని పెంచడానికి సహాయ పడుతుంది
2.శరీరంలో వాటర్ కంటెంట్ బ్యాలెన్స్ చేస్తుంది
3.బరువు తక్కువగా ఉన్నవారికి బరువు పెరగడంలో సహాయ పడుతుంది.
4.ఇందులో కాల్షియమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకలను దృఢంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది
5.జీర్ణ క్రియకు ఉపయోగపడుతుంది. ఇందులో ఎంజైమ్ లు అధికంగా ఉంటాయి కాబట్టి ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.
6.బాడీ హీట్ ను తగ్గిస్తుంది
7.ఆకలిని కంట్రోల్ చేస్తుంది.
8.చెడు బాక్టీరియా ని బయటకు పంపుతుంది.

కావలసిన పదార్థాలు:-

1.పెరుగు - 1 కప్
2.షుగర్ -4 టేబుల్ స్పూన్
3.యాలకులు -2
4.రోజ్ వాటర్ - 1 టీ స్పూన్
5.చల్లటి నీళ్లు -2 గ్లాసులు
6.పుదీనా ఆకులు - 4

ప్రిపరేషన్ ఆఫ్ లస్సీ

1.ముందుగా ఒక బౌల్ లో పెరుగు తీసుకోవాలి.అందులో చక్కెర,రోజ్ వాటర్ వేసి బాగా కలిపి నీళ్లు పోసుకుని మజ్జిగ కవ్వం సహాయంతో బాగా కలుపుకోవాలి.
2.యాలకులని పొడి కొట్టి పక్కన ఉంచుకోవాలి.
3.ఇపుడు రెండు గ్లాసులు తీసుకుని అందులో పోసుకుని పైన యలకుల పొడి, పుదీనా ఆకులు వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన చల్లచల్లని లస్సీ రెడీ అవుతోంది.
4.షుగర్ వద్దు అనుకునే వాళ్ళు ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి.
5.కొంతమంది ఇందులో పాల మీగడ కూడా వేస్తారు.
6.ఇందులో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు.
7.తప్పకుండా ప్రయత్నించండి. చాలా చాలా బాగుంటుంది





Comments

Popular posts from this blog

ఉసిరి జామ్ ( goosberry jam )

టేస్టీ టేస్టీ వాంగీ బాత్