సేమ్యా పాయసం
కావలసిన పదార్థాలు:
1. సేమ్యా -1 ప్యాకెట్
2. నెయ్యి
3. యాలకులు- 5-పొడి చేసుకోవాలి
4.కిస్మిస్
5.జీడిపప్పు
6.బాదం
7.చక్కెర
8. పాలు-హాఫ్ లీటర్
తయారీ విధానం:
ముందుగా ఒక pan లో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక సేమ్యా వేసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే pan లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ అన్ని ఒకదాని తరువాత ఒకటి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇపుడు పాన్ లో పాలు పోసి కొద్దిగా హాఫ్ గ్లాస్ నీళ్లు కూడా పోసి మీడియం to స్లో లో మరిగించుకోవాలి. ఒక 2 పొంగులు వచ్చాక వేయించిన సేమ్యా add చేసి బాగా boil అయ్యాక చెక్కర వేసి బాగా కలిపి పొడి చేసిన యాలకల పొడి వేసి వేయించుకున్న డ్రై fruits తో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి సేమ్యా పాయసం రెడీ.
Comments
Post a Comment