బనానా రోజ్ మిల్క్ షేక్


కావలసిన పదార్థాలు :
1.అరటిపండు ముక్కలు -1 కప్పు
2.పాలు - 1 కప్పు
3.రోజ్ సిరప్ -3 టీ స్పూన్
4.పంచదార -3 టీ స్పూన్
5.ఐస్ ముక్కలు -కొన్ని
6.జీడిపప్పు, బాదంపప్పు -కొన్ని

తయారీ విధానం :
*ముందుగా బాగా మగ్గిన అరటిపండు ముక్కలు, పంచదార మిక్సీ జార్ లో వేసుకుని బాగా బ్లెండ్ చేయాలి.
ఇందులో పాలు,రోజ్ సిరప్,ఐస్ ముక్కలు వేసి బాగా నురగ వచ్చేలాగా బ్లెండ్ చేసి పొడవాటి గ్లాస్ లో పోసుకుని పైన తరిగిన బాదంపప్పు, జీడిపప్పు వేసుకుని చల్లగా సర్వ్ చేయాలి. అంతే ఎంతో రుచికరమైన బనానారోజ్ మిల్క్ షేక్ రెడీ.
*దీనికోసం చల్లని పాలనే తీసుకోవాలి. ఇది తాగే ముందే చేయాలి. ముందుగా చేసుకుంటే బనానా కలర్ చేంజ్ అవుతుంది.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం