మటన్ కీమా బాల్స్ ( Matan keema balls )
మటన్ కీమా బాల్స్ రెసిపీ చాలా టేస్టీ అయినటువంటి రెసిపీ. దీనిని స్నాక్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీ గా కూడా ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు దీనిని స్కిప్ చేయడమే మంచిది.
ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం.
Ingredients :
1.మటన్ కీమా - 250 గ్రామ్స్
2.కొత్తిమీర - హాఫ్ కప్
3.వెల్లుల్లి రెబ్బలు -5
4.పచ్చిమిర్చి -4
5.కారం - 1 టీ స్పూన్
6.అల్లం - చిన్న ముక్క
7.ధనియాలపొడి - 1 టీ స్పూన్
8.ఉప్పు - రుచికి సరిపడ
9.నూనె - తగినంత
Preparation Method ( తయారీ విధానం):-
1.కీమా ను బాగా శుభ్రంగా కడిగి తడి ఆరే వరకు పక్కన ఉంచాలి.
2.మిక్సీ జార్ లో కొత్తిమీర, పచ్చిమిర్చి,వెల్లుల్లి, అల్లం వేసి కొన్ని నీళ్లు పోసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి.
3.కీమా ని ఒక బౌల్ లో వేసుకుని, పైన చేసుకున్న పేస్ట్,కారం,ధనియాలపొడి,రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలిపి మెత్తగా చేసుకోవాలి
4.ఇపుడు ఒక కడాయి లో తగినంత ఆయిల్ వేసుకుని కాగిన తరువాత కీమా బాల్స్ ని వేసి మీడియం ఫ్లేమ్ మీద వేగించుకోవాలి. ఇపుడు కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి కీమా బాల్స్ రెడీ.
ఈ రెసిపీ ని ఆయిల్ తో కాకుండా వాటర్ లో ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు. తొందరలోనే ఆ రెసిపీ ని కూడా షేర్ చేస్తాను. ఇప్పటికి ఈ రెసిపీ ని ఎంజాయ్ చేయండి. have a good day.
Comments
Post a Comment