ఉలవ చారు చికెన్ బిర్యానీ

ఉలవచారు చికెన్ బిర్యానీ

తెలుగు రాష్ట్రాలలో చాలా ఫేమస్ అయినటువంటి రెసిపీ. పేరులోనే ఉంది ఉలవచారు చికెన్ బిర్యానీ. చాలా ప్రత్యేక మైనటువంటి రెసిపీ. మాములుగా తినే బిర్యానీ కాకుండా ఇలా ఒకసారి  డీఫ్రెంట్ గా ట్ర్య్ చేయండి. చాలా బాగుంటుంది. ఉలవచారు తో చికెన్ బిర్యానీ అదిరిపోతుంది.

హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఈ రెసిపీ. అక్కడ రెస్టారెంట్ లలో కూడా అందుబాటులో ఉంటుంది. ఉలవలు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి.
కాబట్టి తప్పకుండ ఒకసారి ఇంట్లో ట్ర్య్ చేసి చూడండి. అందరికి నచ్చుతుంది. ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం మరియు దానికి కావలసిన పదార్థాలు చూసేద్దామ.

క్యాలోరీస్
271.66క్యాలోరీస్
కార్బోహైడ్రేట్లు - 34.96 g
ప్రోటీన్ - 7.39 g
ఫ్యాట్ - 11. 44 g
ఫైబర్ - 2.08 g

కావలసిన పదార్థాలు:-
  1. చికెన్ - 1 కేజీ
  2. పెరుగు - 500 గ్రాములు
  3. అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 tsp
  4. పసుపు - ½ tsp
  5. కారం - 3 tsp
  6. ఉప్పు - రుచికి సరిపడినంత
  7. చికెన్ బిర్యానీ మసాల - 2 tsp
  8. పచ్చిమిర్చి - 3
  9. పుదీనా - ½ కప్
  10. కొత్తిమీర - ½ కప్
  11. నెయ్యి - 4 tsp
  12. నూనె - తగినంత
  13. వేయించిన ఉల్లిపాయలు - అర కప్పు
  14. బాస్మతి బియ్యం - 1కేజీ
  15. ఉలవ చారు - 300ml
  16. నీళ్ళు - తగినన్ని
  17. నిమ్మకాయ - 1
  18. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అన్ని ఒక్కొక్కటి

మసాల తయారీ కోసం కావలసిన పదార్థాలు :-
  1. లవంగాలు - 5
  2. యాలకులు - 5
  3. దాల్చిన చెక్క - 3 inch
  4. జాపత్రి - 1
  5. జాజికాయ - సగం ముక్క
  6. షాజీర - 2 tsp
  7. సోంపు - ½ tsp
  8. అనాస పువ్వు - 1
  9. బిర్యానీ ఆకు - 2
  10. ధనియాలు - 2 tsp
  11. మరాఠీ మొగ్గలు - 2

తయారీ విధానం:-
  1. ముందుగా ఒక పాన్ లో మసాల దినుసులు ఒక్కొక్కటిగా వేసి స్లో ఫ్లేమ్ మీద వేయించుకుని చల్లార్చుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి
  2. ఇపుడు ఒక పెద్ద బౌల్ లో చికెన్ ముక్కలను బాగా కడిగి అందులో పసుపు, కారం, ఉప్పు, నూనె(1tsp కాగపెట్టినది),నెయ్యి, పెరుగు, బిర్యాని మసాల,పచ్చిమిర్చి తరుగు,కొత్తిమీర, పుదీనా, కొన్ని వేయించిన ఉల్లిపాయ ముక్కలు,నిమ్మరసం వేసి ముక్కలకి అన్ని పెట్టేలాగా కలుపుకుని ఒక గంట పాటు నానబెట్టాలి.
  3. తరువాత బియ్యాన్ని బాగా కడిగి తగినన్ని నీళ్లు పోసి అర గంట సేపు నానబెట్టాలి.
  4. ఇపుడు అడుగు మందంగా ఉన్న బాణలి తీసుకుని అందులో తగినంత నూనె పోసి వేడి చేసుకుని గంట పాటు నానబెట్టిన చికెన్ ని వేసి కలిపి మూత పెట్టి మంట స్లో గా పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించాలి.
  5. ఇపుడు అన్నం ని కూడా పూర్తిగా కాకుండా 50 to 70% ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి
  6. ఇపుడు చికెన్ వుడుకుతున్న బాణలి మూత తీసి బాగా కలిపి అందులో ముందుగానే తయారు చేసుకున్న ఉలవ చారును పోసి బాగా కలిపి మరో 5 నుండి 7 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకోవాలి
  7. తరువాత సగం ఉడికిన అన్నాన్ని ఉలవ చారు చికెన్ మీద వేసి సమంగా పరుచుకోవాలి
  8. దాని మీద పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు వేసి గాలి చొరబడకుండా అల్యూమినియం ఫాయిల్ తో బాణలి చుట్టూ చుట్టి మూత పెట్టి 15నిమిషాలు సిమ్ లో పెట్టి తరువాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే 15 నిమిషాలు వదిలేయాలి.
  9. 15 నిమిషాల తరువాత మూత తీసి సర్వ్ చేసుకోవాలి.
  10. అంతే ఎంతో రుచికరమైన ఉలవ చారు చికెన్ బిర్యానీ రెడీ.
  11. తప్పకుండా ట్ర్య్ చేయండి. రుచి అదిరిపోతుంది.

అన్నం మీద పుదీనా, కొత్తిమీర తో పాటు కుంకుమపువ్వు ని 2 tsp పాలకి కలిపి వాటిని కూడా పైన వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు వదిలేయొచ్చు. ఉప్పు, కారం మాత్రం వండే ప్రతీ స్టేజ్ లో చూసుకుంటూ తగినంత వేసుకోవాలి.

ఉలవ చారు వేసిన తరువాత ఏంటి బిర్యానీ అంతా నల్లగా అయ్యింది అనుకోకండి. నల్లగా ఉందని కలర్ కోసం చూసుకోవద్దు. రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి.

హెల్త్ బెనిఫిట్స్:-
  1. ఉలవలను తీసుసుకోవడం వలన దానిలో వుండే ప్రోటీన్స్ అన్ని మన శరీరానికి అందుతాయి
  2. ఉలవలలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి
  3. వాటిని తీసుకోవడం వలన శరీరంలో వుండే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ ని మెరుగుపరుస్తాయి
  4. బరువు తగ్గాలి అనుకునే వారు తప్పకుండ డైట్ లో ఉలవలను యాడ్ చేసుకోవడం వలన వారి బరువును తగ్గించడంలో ఉత్తము ఫలితాలను ఇస్తుంది
  5. దీని వలన బ్లడ్ ప్రెషర్ తగ్గే అవకాశం ఉంటుంది
  6. అంతేకాకుండా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయ పడుతుంది
  7. ఆర్ర్థ రైటీస్ వున్న వాళ్ళకి దీన్ని తీసుకోవడం వలన తగ్గే అవకాశం ఉంటుంది
  8. పైల్స్ ఉన్నవాళ్ళకి నొప్పి నుండి విముక్తి కలిగిస్తుంది.



Comments

Popular posts from this blog

ఉసిరి జామ్ ( goosberry jam )

టేస్టీ టేస్టీ వాంగీ బాత్

లస్సీ ( Lassi )