కాకరకాయ వేపుడు (Bitter gouard fry )


Ingredients (కావలసిన పదార్థాలు):-
1.కాకరకాయలు ( bitter gouard)- పావు కేజీ
2.వెల్లుల్లి రెబ్బలు -6
3.పోపు దినుసులు - 2 టీ స్పూన్స్
4.పసుపు - హాఫ్ టీ స్పూన్
5.కారం - 1 టీ స్పూన్
6.ఉప్పు - రుచికి సరిపడ
7.కరివేపాకు -2 రెమ్మలు
8.నూనె - 1 కప్పు

తయారీ విధానం :-
*ముందుగా కాకరకాయ ముక్కలు కోసి  సన్నగా కోసి ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద ఉడకబెట్టాలి.
*అయిదు నిమిషాలు ఉడికించిన తరువాత దించి నీళ్లు ఉంటే వంచి పక్కన పెట్టుకోవాలి.
*ఇపుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక అందులో పోపు దినుసులు వేసి వేగాక, వెల్లుల్లి రెబ్బలు,కరివేపాకు వేసి వేగాక కాకరకాయ ముక్కలు వేసి కలిపి ఒక అయిదు నిమిషాలు అలాగే వేగనివ్వాలి.
*తరువాత అందులో ఉప్పు,కారం ,పసుపు వేసి బాగా కలపాలి.
*మరో అయిదు నిమిషాలు వేపి కాకరకాయలు బాగా పొడి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి.
* అంతే టేస్టీ టేస్టీ కాకరకాయ వేపుడు రెడీ అవుతుంది.

ఈ కాకరకాయలను తరచుగా తింటూ ఉండాలి. ఎందుకంటే ఇందులో iron, vitamin B1,B2,B3,C ఉన్నాయి.ఇందులో calcium కూడా ఉంది కాబట్టి కచ్చితంగా తింటూ ఉండాలి. కర్రీస్ కానీ ఇలా వేపుడు కానీ పులుసు కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉండాలి. మనకు కావలసిన విటమిన్లు అన్ని అందుతాయి. కచ్చితంగా try చేయండి. అందరికి నచ్చుతుంది.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

ఉలవ చారు చికెన్ బిర్యానీ