సపోటా మిల్క్ షేక్
కావలసిన పదార్థాలు :
1. 5 సపోటాలు
2. అర లీటర్ పాలు
3.పంచదార (రుచికి సరిపడ)
4.వెనిల ఐస్ క్రీమ్ (చిన్న కప్)
తయారీ విధానం :
పాలలో రుచికి సరిపడా పంచదార వేసి కాచి పక్కన పెట్టుకోవాలి. సపోటాలను గింజలు తీసి ముక్కలుగా చేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని అందులో కాచి చల్లారిన పాలను వేసి ఇంకో సారి జ్యూసర్ లో వేసి ఇంకోసారి తిప్పాలి.ఇపుడు ఒక గ్లాస్ లోకి దాన్ని తీసుకుని వెనిల ఐస్ క్రీమ్ ని వేసుకుని కలిపి కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టి తాగితే ఆహా చాలా హాయిగా ఉంటుంది. కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు.

Nic
ReplyDelete