మెంతి చెక్కలు
Ingredients :
1.శనగపిండి - 1 cup
2.మైదా- half cup
3.మొక్కజొన్న పిండి -half cup
4.ఉడికించిన బంగాళదుంప ముద్ద -half cup
5.వేయించిన పల్లీల పొడి - పావు కప్పు
6.వాము -1 టీ స్పూన్
7.అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
8.మెంతి ఆకులు - 1cup
9.ఉప్పు - తగినంత
10.కారం - తగినంత
11.తెల్ల నువ్వులు - 3 టీ స్పూన్
12.నూనె- వేయించడానికి సరిపడ
Making process ( తయారీ విధానం):
*ముందుగా మెంతి ఆకులను శుభ్రం చేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
*ఇపుడు నూనె తప్ప మిగతా అన్ని పదార్థాలను ఒక పెద్ద బౌల్ లో వేసుకుని తగినన్ని నీళ్లు యాడ్ చేసుకుంటూ పూరీ పిండి లాగా కలపాలి.
*ఈ పిండిని కొంచెం సేపు నానబెట్టాలి.
*తరువాత ఒక బాణలిలో నూనె వేసి కాగాక ఆ పిండిని చెక్కల్లాగా వత్తుకుని ఆయిల్ లో మీడియం ఫ్లేమ్ లో గోల్డ్ కలర్ వచ్చే వరకు fry చేసుకోవాలి.ఇలాగే అన్ని చేసుకోవాలి. వేడి తగ్గిన తరువాత ఒక డబ్బాలో పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మెంతి చెక్కలు రెడీ. తప్పకుండా try చేయండి.
పూరీ presser లో కూడా ప్లాస్టిక్ కాగితం మీద ఆయిల్ రాసి పైన ఇంకో ప్లాస్టిక్ కాగితం ని పెట్టి వత్తుకోవచ్చు.

Comments
Post a Comment