హాట్ అండ్ సోర్ వెజ్ సూప్
కావలసిన పదార్థాలు :
1.క్యారెట్ తరుగు - అర కప్పు
2.బీన్స్ తరుగు - అర కప్పు
3.కీర దోస తరుగు -అర కప్పు
4.ఉల్లికాడల తరుగు - అర కప్పు
5.పండు మిర్చి పేస్ట్ -అర టీ స్పూన్
6.కార్నఫ్లోర్ - 1 టీ స్పూన్
7.ఉప్పు -తగినంత
8.నీళ్లు -మూడు కప్పులు
9.టమాటో సాస్ -1 టీ స్పూన్
10.మిరియాల పొడి - చిటికెడు
11.నూనె -1 టీ స్పూన్
తయారీ విధానం :
* ముందుగా పాన్ లో నూనె వేసి వేడి అయ్యాక క్యారెట్, బీన్స్,కీర దోస తరుగు వేసి మగ్గనివ్వాలి.తరువాత కార్నఫ్లోర్ కలిపి రెండు నిమిషాలు ఆగి పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి,ఉల్లికాడల తరుగు, టమాటో సాస్,ఉప్పు, నీళ్లు వేసి బాగా కలిపి పది నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే ఎంతో రుచికరమైన హాట్ అండ్ సోర్ వెజ్ సూప్ రెడీ.
ఇలా అన్ని వెజిటబుల్స్ తీసుకోవడం వలన మన శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి.

Comments
Post a Comment