సాబుదానా కిచిడీ


కావలసిన పదార్థాలు :
1.సగ్గుబియ్యం (2 కప్పులు)
2.బంగాళదుంప (ఆలు)- (2 )
3.పచ్చిమిర్చి (సరిపడ)
4.జీలకర్ర (1 టీ స్పూన్)
5.వేయించిన పల్లీలు  (ఒకటిన్నర కప్పు)
6.పచ్చికొబ్బరి తురుము (అర కప్పు)
7.ఉప్పు (రుచికి సరిపడ)
8.నిమ్మరసం (2 టీ స్పూన్)
9.కొత్తిమీర (తగినంత)
10.నెయ్యి లేదా ఆయిల్ (తగినంత)
11.పంచదార ( అర టీ స్పూన్)

తయారీ విధానం :
* ముందుగా సగ్గుబియ్యం ని బాగా కడిగి అయిదు గంటల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. అవి నానిన తరువాత వాటర్ వడగట్టి పెట్టుకోవాలి.
*కడాయి లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని జీలకర్ర ,కట్ చేసిన పచ్చిమిర్చి ,ఆలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసి ఆలు మెత్తబడే వరకు వేయించాలి.
*ఆలు వేగాక అందులో సగ్గుబియ్యం, పంచదార,ఉప్పు వేసి బాగా కలిపి సన్నని మంట మీద 5 నిమిషాలు ఉంచాలి.
* వేయించిన పల్లీలను సగం బరక బరకగా పొడి చేసుకుని ఉంచుకోవాలి.
*ఇపుడు అందులో పల్లీ ల పొడి ,మిగతా సగం పల్లీలు,కొబ్బరి తురుము,నిమ్మరసం వేసి బాగా కలిపి 2 నిమిషాలు సిమ్ లో ఉంచి దించేయాలి.
*తరువాత కొత్తిమీర తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేయడమే.tasty tasty సాబుదానా కిచిడీ రెడీ.ఖచ్చితంగా try చేయండి. చాలా బాగుంటుంది.
 ఆలు,పల్లీలు అసలు skip చేయొద్దు. టేస్ట్ అంత వాటిలోనే ఉంటుంది.పచ్చి బఠాణీలు కూడా available ఉంటే వేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

బనానా రోజ్ మిల్క్ షేక్