ఉలవ చారు


కావలసిన పదార్థాలు :
1.ఉలవలు - 1 కప్పు
2.చింతపండు - నిమ్మకాయ సైజ్ అంత
3.పచ్చిమిర్చి - రుచికి సరిపడ
4.ఉప్పు - రుచికి సరిపడ
5.ఎండుమిర్చి -2
6.కరివేపాకు - 4 రెబ్బలు
7.జీలకర్ర -2 టీ స్పూన్
8.ఆవాలు - 1 టీ స్పూన్
9.బెల్లం - రుచికి సరిపడ
10.ధనియాలు - 1 టేబుల్ స్పూన్
11.వెల్లుల్లి - 6 రెబ్బలు
12.నూనె -పోపుకు సరిపడ
తయారీ విధానం :
* ముందుగా ఉలవలను రాత్రంతా నానబెట్టి మెత్తగా ఉడికించి అందులో సగం ఉలవలను పేస్ట్ చేసుకోవాలి.
*బాణలిలో నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,కరివేపాకు,పచ్చిమిర్చి వేసి  వేగించి ఉలవలను ఉడికించిన నీరు ని పోసి బాగా మరిగించుకోవాలి.
*ఒక పొంగు రాగానే పసుపు,బెల్లం,ఉలవల పేస్ట్, బెల్లం,ఉప్పు,చింతపండు గుజ్జు వేసి బాగా 20 నిమిషాలు meduim flame లో మరిగించుకోవాలి.
*ఇందులో ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు డ్రై roast పొడి వేసి బాగా కలిపి కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉలవ చారు ready.
మిగతా ఉలవలను కూడా చారు లో వేసుకోవాలి. తింటున్నపుడు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. తప్పకుండా try చేయండి.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

ఉలవ చారు చికెన్ బిర్యానీ