సొరకాయ హల్వా


కావలసిన పదార్థాలు :
1.సొరకాయ ( అర కిలో )
2.పంచదార (కప్పు)
3.కోవా (కప్పు)
4.పాలు (అర లీటర్)
5.ఎండు ద్రాక్ష (తగినంత)
6.జీడిపప్పు (తగినంత)
7.నెయ్యి (తగినంత)
8.బాదం (తగినంత)
9.యాలకుల పొడి (1 టీ స్పూన్)
10.గ్రీన్ ఫుడ్ కలర్ ( చిటికెడు )

తయారీ విధానం :
* ముందుగా సొరకాయ ని చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి.
* నాన్స్టిక్ పాన్ లో నెయ్యి వేసి ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు అన్ని ఒకదాని తరువాత ఒకటి వేయించి పక్కకు తీసుకోవాలి.
* అదే పాన్ లో  మరి కొంచెం నెయ్యి  వేసి తురిమిన సొరకాయ ను వేసి పది నిమిషాలు సిమ్ లో ఉడికించాలి.
*అది ఉడికిన తరువాత పాలు, ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి ఒక పొంగు వరకు ఉడికించి అందులో పంచదార, కోవా, యాలకుల పొడి వేసి బాగా కలిపి మనకు ఎంత consistency కావాలో అంతవరకు సిం లో పెట్టుకుని ఆఫ్ చేసి serving బౌల్ లోకి తీసుకుని dry fruits తో గార్నిష్ చేయండి. అంతే ఎంతో tasty tasty సొరకాయ హల్వా రెడీ. ఈ సమ్మర్ లో ఖచ్చితంగా చేసుకుని తినండి. చాలా బాగుంటుంది.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

ఉలవ చారు చికెన్ బిర్యానీ