చాక్లెట్ కుల్ఫీ
1.డార్క్ చాక్లెట్ తురుము (అర కప్పు)
2.పంచదార (అర కప్పు)
3.కండెన్సడ్ మిల్క్ (అర కప్పు)
4.పచ్చి కోవా (3/4 కప్పు)
5.పాలు (1 లీటర్)
తయారీ విధానం :
ఒక అడుగున మందం గా ఉన్న గిన్నె లో పాలు పోసి మూడింట ఒక వంతు అయ్యేవరకు మరిగించాక అందులో కోవా, కండెన్స్డ్ మిల్క్ వేసి మరో అయిదు నిముషాలు కలుపుతూ ఉడికించాలి.తరువాత పంచదార,చాక్లెట్ తురుము కూడా వేసి కలిపి మరో అయిదు నిమిషాలు ఉడికించాలి.ఈ మిశ్రమాన్ని చల్లారిన తరువాత కుల్ఫీ మౌల్డ్ లో పోసి 6 నుండి 7 గంటలు డీఫ్రిడ్జ్ లో పెట్టాలి. అంతే tasty tasty చాక్లెట్ కుల్ఫీ రెడీ.
Note : పాలు మూడింట ఒక వంతు అయ్యాక ఈ proces అంత తక్కువ ఫ్లేమ్ లో చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కుల్ఫీ పైన చాక్లెట్ చిప్స్ ని లేదా చాక్లెట్ ని మెల్ట్ చేసుకుని కుల్ఫీ పైన వేసుకుని కూడా తినొచ్చు. తప్పకుండా try చేసి చూడండి అందరికి నచ్చుతుంది.

Comments
Post a Comment