నువ్వుల పచ్చి పులుసు
కావలసిన పదార్థాలు :
1.నువ్వులు -అర కప్పు
2.చింతపండు- నిమ్మకాయ సైజ్ అంత
3.పచ్చిమిర్చి - తగినంత
4.ఉప్పు-రుచికి సరిపడ
5.పంచదార లేదా బెల్లం - రుచికి సరిపడ
5.నీళ్లు - తగినన్ని
6.ఉల్లిపాయ ముక్కలు -1 కప్పు
7.కొత్తిమీర - తగినంత
తాలింపు కోసం :
1.ఆవాలు -1 టీ స్పూన్
2.జీలకర్ర -1 టీ స్పూన్
3.కరివేపాకు - 2 రెబ్బలు
4.వెల్లుల్లి - 4 రెబ్బలు
5.పసుపు - అర టీ స్పూన్
6.నూనె - పోపు కు సరిపడ
తయారీ విధానం :
*చింతపండు ని కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి.
*నువ్వులను సిం లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టాలి.
*ఇపుడు కొంచెం ఆయిల్ వేసి రుచికి సరిపడ పచ్చిమిర్చి వేసి వేయించి చల్లార్చు కోవాలి.
*
మిక్సీ జార్ లో నువ్వులను, పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. బరక గా అయిన చెసుకోవచ్చు. పేస్ట్ లాగా అయిన చేసుకోవచ్చు. మీ ఇష్టం ని బట్టి చేసుకోండి.
*ఇపుడు ఒక బౌల్ లో నానబెట్టిన చింతపండు నుండి రసం squeeze చేసుకుని అందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్, పంచదార కానీ బెల్లం కానీ,ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపు కోవాలి.
*ఇపుడు పైన ఉన్న తాలింపు గింజలతో తాలింపు పెట్టుకుని తినేయడమే.
ఎంతో tasty tasty నువ్వుల పచ్చి పులుసు ready.
ఇందులో బెల్లం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా try చేయండి.

Comments
Post a Comment