కొత్తిమీర వడలు
కావలసిన పదార్థాలు:
1.కొత్తిమీర (2 కట్టలు)
2.సేనగపిండి ( 2 కప్పులు)
3.బియ్యంపిండి ( 1 కప్పు)
4. జొన్నపిండి (1 కప్పు)
4. జొన్నపిండి (1 కప్పు)
5.నువ్వులు (1 టీ గ్లాస్ సరిపడా)
6.జీలకర్ర (1 టేబుల్ స్పూన్)
7.వాము ( 1 టేబుల్ స్పూన్)
8.ఉప్పు ( రుచికి సరిపడా)
9.కారం ( 2 టేబుల్ స్పూన్)
10.ఆయిల్ (4 టేబుల్ స్పూన్)
తయారీ విధానము:
ముందుగా కొత్తిమీర కట్టలను వలచుకుని కడిగి చిన్నగా కట్ చేసి ఒక పెద్ద గిన్నె లో వేసుకోవాలి. అందులో 2 కప్పుల సేనగపిండి,1 కప్పు బియ్యంపిండి, జొన్నపిండి, నువ్వులు, జీలకర్ర, ఉప్పు వాము, కారం,1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపాలి. నీళ్లు ఎక్కువగా పోయాకుడదు. గట్టిగా చపాతీ చేసే ముద్ద లాగా చూసుకుని కలపాలి.అలా చేసిన ముద్దను రెండు భాగాలుగా చేసుకోవాలి.ఇపుడు కరెంట్ రైస్ కుక్కర్ లో రెండు గ్లాస్ ల నీళ్లు పోసి వేడి అయ్యాక అందులో సరిపడే గిన్నె తీసుకుని అడుగున ఆయిల్ కొంచెం రాసి ముద్దగా చేసుకున్న ఆ కొత్తిమీర మిశ్రమాన్ని రౌండ్ గా సర్కిల్ లాగా పెట్టుకొని పైన కుక్కర్ మీద మూత పెట్టి ఒక పది నుండి పదిహేను నిమిషాలు వుండించుకోవాలి. అవి ఉడికించాక చల్లగా చేసుకుని కట్ చేసుకుని అలాగే డైరెక్ట్ గా తినేయొచ్చు లేదా ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీ గా వుండే కొత్తిమీర వడలు రెడీ.
గమనిక : ఈ వడలను ఇడ్లి కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులు మాత్రమే తీసుకుంటే వడలు బాగా వస్తాయి.
www.google.com
www.google.com

Comments
Post a Comment