ఎగ్ బిర్యాని
కావలసిన పదార్థాలు:
1.కోడిగుడ్లు - 5
2.ఉల్లిపాయలు-2
3.నెయ్యి -తగినంత
4.వెల్లుల్లి రెబ్బలు -2
5.బిర్యాని ఆకు -2
6.దాల్చిన చెక్క-1
7.నల్ల యాలకులు-2
8.పచ్చ యాలకులు-4
9.పసుపు-1 టీ స్పూన్
10.కారం - తగినంత
11.బాస్మతి బియ్యం - తగినంత
12.నీళ్లు -తగినన్ని
13.ఉప్పు -సరిపడ
14.గరం మసాలా -2 టీ స్పూన్
15.కొత్తిమీర- తగినంత
తయారీ విధానం :
* ముందుగా కోడిగుడ్ల ను ఉడికించి చెక్కు తీసి కొంచెం ఆయిల్ లో ఉప్పు, కారం,పసుపు వేసి లైట్ గా వేయించి పెట్టుకోవాలి.
*బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి.
*తరువాత బిర్యాని ఆకులు, దాల్చిన చెక్క,యాలకులు వేసి వేయించాలి.
*తరువాత పసుపు, కారం వేసి బాగా కలిపి ముందుగానే నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసి రెండు నిమిషాలు వేయించి తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించాలి.నీళ్లు అన్ని ఇంకి పోయాక ఫ్రై చేసుకున్న కోడి గుడ్లను వేసి నిదానం గా కలిపి కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఎగ్ బిర్యాని రెడీ.
టమాటో కూడా వేసుకోవచ్చు.

Comments
Post a Comment