కొత్తిమీర-టమాటో పచ్చడి ( Coriander-tomato pickle)
కొత్తిమీర-టమాటో పచ్చడి ఇడ్లి లో కానీ దోస, అన్నం, చపాతీ ,రోటీ అన్నిటిలోకి చాలా రుచిగా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే రెండు నుండి మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది.ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా.
Ingredients to prepare coriander-tomato pickle ( కొత్తిమీర- టమాటో తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ):-
1.కొత్తిమీర (coriander )- 1 కట్ట
2.టమాటోలు (tomato)- 6 పెద్ద సైజువి
3.వెల్లుల్లి రెబ్బలు ( garlic )- 6
4.పచ్చిమిర్చి (green chilli)- 10
5.చింతపండు పేస్ట్ ( tamarind paste )- 1/2 కప్
6.ఉప్పు (salt )- as u required (రుచికి సరిపడ)
7.కరివేపాకు (curryleaves)- పోపు కు సరిపడ
8.జీలకర్ర ( jeera)- పోపు కు సరిపడ
9.నూనె ( oil)- తగినంత
Preparation method ( తయారీ విధానం):-
- ముందుగా టొమాటోలను, పచ్చిమిర్చి, కొత్తిమీర ని కడిగి కట్ చేసుకుని పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి కాగిన తరువాత టొమాటోలు,పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేయించి మగ్గనివ్వాలి.
- మగ్గిన తరువాత అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి గోల్డ్ కలర్ వచ్చాక అందులో ఉప్పు, చింతపండు పేస్ట్ వేసి బాగా కలిపి అందులో నుండి ఆయిల్ రిలీస్ అయ్యేవరకు మగ్గించాలి.
- ఆయిల్ రిలీస్ అయ్యింది అంటే బాగా ఉడికింది అని అర్థం
- ఇపుడు స్టవ్ ఆఫ్ చేసి అది బాగా చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి.
- ఇపుడు బాణలిలో 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసి అందులో కరివేపాకు, జీలకర్ర వేసి వేగాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలిపి 3 నిమిషాలు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత ఒక బౌల్ లో పెట్టుకోవాలి.
- అంతే ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ.
- వేడివేడిగా తింటే దీని రుచి అదిరిపోతుంది.

Comments
Post a Comment