Fruit salad ( ఫ్రూట్ సలాడ్)


ఫ్రూట్ సలాడ్ అనేది చాలా healthy అయిన రెసిపీ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే పిల్లలకు బాక్స్ లో పెట్టి ఇస్తే కాళీ బాక్స్ రిటర్న్ వస్తుందండి. అంత నచ్చుతుంది పిల్లలకి. ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినని వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇలా చేసి ఇస్తే చాలా ఇష్టం గా తింటారు. అయితే ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా.

Ingredients for making fruit salad ( ఫ్రూట్ సలాడ్ చేయడానికి కావలసిన పదార్థాలు ):-
1.దానిమ్మ గింజలు  ( pomegranate )- 1 cup
2.ద్రాక్షపళ్ళు ( గ్రేప్స్)- 1 cup
3.పైన్ ఆపిల్ ముక్కలు (pineaplle pieces)- 1cup
4.అరటిపండు ముక్కలు (బనానా pieces )- 1 cup
5.చెర్రీ పండ్లు (cherries )- 1/2 cup
6.మామిడిపండు ముక్కలు (mango pieces)- 1 cup
7.ఆపిల్ ముక్కలు ( apple)- 1 cup
8.మిరియాల పొడి ( pepper powder ) - 1/2 cup
9.తేనె ( honey )- 1/4 cup
10. ఉప్పు (salt) -as u required (రుచికి సరిపడ)
11.నిమ్మరసం (lemon juice )- 2 spoons

Preparation method (తయారీ విధానం):-
పైన ఉన్న పండ్లను అన్నిటిని శుభ్రం చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్ లో వేసుకోవాలి.
బౌల్ లో వేసుకున్న పండ్లపై మిరియాల పొడి ని,రుచికి సరిపడ ఉప్పు ని, నిమ్మరసం ని ,తేనె ని కలిపి ఒక 1 నుండి 2 గంటలపాటు fridge లో పెడితే ఎంతో చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది.

౼>ముఖ్యంగా ఈ సమ్మర్ లో చేసుకోండి .మనసుకు హాయిగా ఉంటుంది  ఇది తింటూ ఉంటే.
౼> కివీ పండు ( kiwi fruit )  అందుబాటులో ఉంటే అది కూడా సలాడ్ లో include చేసుకోవచ్చు.
౼>ఇలా అన్ని ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన మన శరీరానికి కావాల్సిన విటమిన్లు అన్ని అందుతాయి.


Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

బనానా రోజ్ మిల్క్ షేక్