కళ్యాణ రసం (kalyana rasam)
కళ్యాణ రసం చాలా మందికి దీని గురించి తెలియదు. ఇది తమిళనాడు సైడ్ చాలా ఫేమస్ అయినటువంటి రసం. ఇపుడు మనం try చేసి చూద్దాం. ఇంకెందుకు లేట్ start చేసేద్దామా !
Ingredients (కావలసిన పదార్థాలు):-
పొడి కోసం పదార్థాలు:-
1.కందిపప్పు - 1 టేబుల్ స్పూన్
2.ధనియాలు -1 టేబుల్ స్పూన్
3.మిరియాలు -1 టేబుల్ స్పూన్
4.జీలకర్ర- 2 టీ స్పూన్స్
5.ఎండు మిర్చి -2
6.నూనె - 2 టీ స్పూన్స్
రసం తయారీ కోసం కావలసిన పదార్థాలు:-
1.కందిపప్పు -3 టేబుల్ స్పూన్స్
2.టమాటో - 1
3.చింతపండు - నిమ్మకాయ సైజ్ అంత
4.వెల్లులి రెబ్బలు -4
5.మిరియాలు - 1 టీ స్పూన్
6.జీలకర్ర- 1 టీ స్పూన్
7.పసుపు - 1 టీ స్పూన్
8.ఉప్పు - రుచికి సరిపడ
9.మంచినీళ్లు - తగినన్ని
పోపు కోసం కావలసిన పదార్థాలు :-
1. నూనె - సరిపడ
2.కరివేపాకు -4 రెబ్బలు
3.ఆవాలు - 1 టీ స్పూన్
4.జీలకర్ర - హాఫ్ టీ స్పూన్
5.ఇంగువ - చిటికెడు
6.కొత్తిమీర - తగినంత
Preparation method ( తయారీ విధానం):-
౼> చింతపండు ని తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి
౼>ఒక కడాయి లో కొద్దిగా నూనె వేసి పొడి కోసం తీసుకున్న పదార్థాలను విడివిడిగా వేయించుకుని చల్లారిన తరువాత పొడి చేసుకుని పెట్టుకోవాలి.
౼>కుక్కర్ లో కందిపప్పు, పసుపు,టమాటో వేసి ఉడికించాలి. తరువాత మెత్తగా మెదిపి అందులో చింతపండు రసం,ఉప్పు పోసి బాగా కలపాలి.
౼>వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర రోట్లో వేసి మెత్తగా నూరుకోవాలి.
౼>ఒక బాణలిలో తగినంత కొంచెం నూనె పోసి కాగిన తరువాత అందులో పోపు కోసం తీసుకున్న పదార్థాలు అన్నిటిని వేసి వేగిన తరువాత వెల్లుల్లి, మిరియాలు,జీలకర్ర నూరిన మిశ్రమాన్ని వేసి బాగా వేగించాలి
౼>తరువాత పైన రెడీ చేసుకున్న పప్పు ని ,రసం పొడి ని వేసి తగినన్ని నీళ్లు పోసుకుని రుచికి సరిపడ ఉప్పు వేసుకుని బాగా రెండు పొంగులు వచ్చే వరకు కాగనివ్వాలి.
లాస్ట్ లో కొత్తిమీర వేసి దించుకుంటే ఆహా ఎంతో రుచికరమైన కళ్యాణ రసం రెడి అవుతుంది.
ఇది వర్షాకాలంలో, చలికాలంలో చాలా బాగుంటుంది. తప్పకుండా try చేయండి.

Comments
Post a Comment