మ్యాంగో చికెన్ కర్రీ


కావలసిన పదార్థాలు :
1.బోన్ లెస్ చికెన్ ( కిలో)
2.మామిడి కాయ (1 )
3.పెరుగు ( 2 టేబుల్ స్పూన్)
4.వెల్లుల్లి ( 1)
5.ఉల్లిపాయలు (3)
6.పచ్చిమిర్చి (తగినంత)
7.పసుపు (1 టీ స్పూన్)
8.ఉప్పు (రుచికి సరిపడ)
9.ధనియాలపొడి (1 టేబుల్ స్పూన్)
10.జీలకర్ర (1 టేబుల్ స్పూన్ )
11.కొత్తిమీర (తగినంత)
12. ఆయిల్ (తగినంత)
13.గరం మసాలా ( 1టేబుల్ స్పూన్)

తయారీ విధానం :
 * చికెన్ ముక్కల్ని కడిగి పెరుగు పసుపు కలిపి పట్టించి అర గంట నానబెట్టాలి.
* మామిడికాయ చెక్కు తీసి ముక్కలుగా కోయాలి. ఇపుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ ముక్కలను,వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి గుజ్జులా చేయాలి. అవసరం అయితే నీళ్లు కొన్ని వేసుకోవచ్చు.
*ఉల్లిపాయలను కూడా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి.
*బాణలిలో కొంచెం ఆయిల్ వేసి కాగాక అర గంట నానబెట్టిన చికెన్ ని  వేసి వేయించాలి.
మీడియం మంట మీద అవి పూర్తిగా వేగాక ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
*మరో బాణలిలో కొంచెం నూనె వేసి కాగాక జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయ పేస్ట్ ని వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.తరువాత మామిడికాయ ,వెల్లుల్లి, పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన పేస్ట్ ,పసుపు, ధనియాలపొడి వేసి కలిపి  అయిదు నిమిషాలు వేయించాలి.
*తరువాత వేయించిన చికెన్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి గ్రేవీ కి సరిపడ నీళ్లు పోసి మూత పెట్టి 20 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి.పూర్తిగా ఉడికించిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవాలి.
పచ్చిమిర్చి బదులు , కారం పొడి కూడా వేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

Apple jam (ఆపిల్ జామ్)

సేమ్యా పాయసం

ఉలవ చారు చికెన్ బిర్యానీ