మాంగో ఖీర్
కావలసిన పదార్థాలు :
1. మామిడిపండ్లు (2 బాగా తియ్యగా ఉన్నవి)
2. పంచదార ( 1 కప్)
3. కొబ్బరిపాలు ( 1 కప్ )
4. నీళ్లు ( 2 కప్స్)
5. డ్రైఫ్రూట్స్ ( గుప్పెడు )
తయారీ విధానం :
ముందుగా మామిడిపండ్లని కడిగి దాని నుండి గుజ్జు తీసి వడగట్టి పెట్టుకోవాలి. ఇపుడు ఒక పాన్ లో గుజ్జు వేసి ,ఆ గుజ్జు కి సమానమైన నీళ్లు పోసి సిం లో పెట్టి అయిదు నుండి పది నిమిషాలు ఉడకనివ్వాలి. ఇపుడు దానిలో పంచదార పోసి బాగా కలుపుతూ ఉండాలి. దానిలో చక్కెర కలిసేంత వరకు బాగా కలపాలి. ఈ విధానం అంతా flame sim లో పెట్టి చేయాలి. లేదంటే మాడిపోతుంది. అందులో చక్కెర కలిసాక కొబ్బరిపాలు పోస్తూ కలపాలి. ఒక అయిదు నిమిషాలు ఉడికించాలి. అంతే tasty tasty mango kheer రెడీ. ఇపుడు dry fruits తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయడమే.
Disclaimer : షుగర్ మీ టేస్ట్ కి సరిపడా తీసుకోండి.
కొబ్బరి పాలు ఉంటే తీసుకోండి. లేదంటే normal milk తో కూడా చేసుకోవచ్చు.

Comments
Post a Comment